![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -132 లో..... మహాకి జాబ్ వస్తుంది. తనకి అప్పాయింట్ మెంట్ లెటర్ చేతికి ఇస్తారు. కంపెనీ ఎండీ.... మీరు నన్ను అందంగా ఉన్నారని కామెంట్ చెయ్యొద్దని మహా అనగానే అది కామెంట్ కాదు కాంప్లిమెంట్ అని ఎండీ చెప్తాడు. మహా అక్కడ నుంచి బయటకు వస్తుంది. కార్ లో చక్రి నిద్రపోతాడు. కార్ లో ఉన్న దేవుడి విగ్రహానికి మహా వచ్చి మొక్కుకుంటుంది. జాబ్ వచ్చిందా రాలేదా అని చక్రి అంటుంటే మీ నోటి నుంచి అసలు మంచి మాటలు రావా అని మహా కోప్పడుతుంది. ఆ తర్వాత కూల్ అయి జాబ్ వచ్చిందని చెప్తుంది. దాంతో మహాకి చక్రి కంగ్రాట్స్ చెప్తాడు.
ఆ తర్వాత మహా, చక్రి ఇద్దరు కలిసి మాధవ వర్క్ చేసే ప్లేస్ కి వెళ్తారు. జాబ్ వచ్చిందని చెప్పి స్వీట్ ఇస్తుంది. అక్కడ మనీషాని చూసి ఎవరు అని అడుగుతుంది. నా చెల్లి అంటూ మాధవ ఫ్రెండ్ మనీషా గురించి చెప్తాడు. ఆ తర్వాత రాత్రి మహా బట్టలు తీసుకొని వచ్చి ఒక్క చక్రికి తప్ప అందరికి ఇస్తుంది. చక్రి బయటకు వచ్చి తన ఫోటో ఫోన్ లో చూసుకుంటూ అందరు ఆవిడకి కన్పిస్తారు నువ్వు తప్పా అని కుళ్ళుకుంటాడు. అప్పుడే మహా వస్తుంది. ఏంటి ఏదో అనుకుంటున్నావు.. నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసావ్.. నీకు స్పెషల్ గా ఇవ్వాలని అక్కడ ఇవ్వలేదు.. ఇదిగో నీ డ్రెస్ అని మహా ఇవ్వగానే చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే.. వాళ్ళు ఎప్పుడు అలా హ్యాపీగా ఉండాలని మాధవ వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత మాధవకి గాయత్రి ఫోన్ చేస్తుంది. పెళ్లి అయినా కూడా ఎందుకు చేస్తుందని చక్రి వాళ్ళు అంటారు. కానీ మాధవ ఫోన్ లిఫ్ట్ చేయడు.
ఆ తర్వాత మరుసటి రోజు మహా ఆఫీస్ కీ రెడీ అవుతుంది. చీర కట్టుకొని వస్తే చక్రి తనని చూసి ఫ్లాట్ అవుతాడు. మొదటిరోజు ఆఫీస్ కి వెళ్తుందని కన్నా టపాసులు కలుస్తారు. దాంతో అందరు వచ్చి చూస్తారు. మరొకవైపు కేశవ దగ్గరికి తన అసిస్టెంట్ వస్తాడు. ఏంట్రా రీల్స్ లో పడి పని నేర్చుకోవడం లేదు.. దానికంటే పనీ పాటా లేదని శైలుని తిడుతాడు. కానీ అతను మాత్రం డల్ గా ఉంటాడు. తరువాయి భాగంలో మహా ఆఫీస్ నుంచి తిరిగి వస్తు కన్నా వాళ్ళ అమ్మని చూస్తుంది. మహా ఇంటికి వచ్చి తన గురించి నారాయణని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |